Monday, 3 August 2015

జీతం 15 వేలు, బిచ్చమెత్తుకుంటే 30 వేలు:
ఢిల్లీ గ్రాడ్యుయేట్ అయిన ఈ యువకుడు ఓ బీపీవోలో పనిచేస్తూ నెలకు 15 వేలు సంపాదిస్తున్నాడు. అయితే నెలంతా కష్టపడితే 15వేలు వస్తుంది కదా మరి బిచ్చమెత్తుకుంటే ఎంతొస్తుందో చూడాలనుకుని ఓ ప్రయోగం చేశాడు. బిచ్చగాడిలా మేకప్ చేసుకుని ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ గంటకు రెండొందల చొప్పున సంపాదించాడు. అంటే యావరేజ్‌న రోజుకు వెయ్యి, నెలకు 30 వేలు చొప్పున లెక్కవేశాడు. నెలంతా కష్టపడితే వచ్చే జీతం కన్నా డబుల్ ధమాకా రావడం చూపించాడు. ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ కన్నా ఓ బిచ్చగాడి ఆదాయం ఎక్కువంటూ నిరసన తెలిపేందుకే కెమెరా సాక్షిగా ఈ ప్రయోగం చేశానంటున్నాడు. మొత్తం ప్రక్రియను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. మనోడిప్పుడు ఫుల్ పాపులర్ అయిపోయిండు. బిచ్చమెత్తుకోవడానికి చిట్కాలు కూడా చెబుతున్నాడు. సిగ్గుపడితే బిచ్చమెత్తుకోలేవని చెప్పే ఈ కుర్రాడు తన దగ్గరకొచ్చేవారికి రాజధాని నగరంలో వీధివీధీ నాదే బ్రదర్ అంటూ పాటలు కూడా నేర్పుతున్నాడు...

No comments:

Post a Comment